పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ జోరు

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. సిద్దిపేటలో అయితే టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావుకు 6వేలకు పైగా ఓట్ల ఆధిక్యత లభించింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతను బట్టి కాంగ్రెస్ 2, తెరాస 9 చోట్ల ఆధిక్యతలు సాధించాయి. సిరిసిల్ల, మక్తల్, తుంగతుర్తి నియోజకవర్గాలలో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది.  పోస్టల్ బ్యాటెల్ లో ఆధిక్యత ఉద్యోగులు, టీచర్ల మూడ్ ను తెలియజేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఉద్యోగులలో ప్రభుత్వ వ్యతిరేకత అంతగా కనిపించడం లేదన్న సంకేతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు. ఇలా ఉండగా కరీంనగర్ జిల్లాలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యత కనిపిస్తున్నట్లుగా సమాచారం ఉంది.