ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు

ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. పెథాయ్ ప్రభావంతో కృష్ణానది పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్యారేజీకి భారీగా వస్తున్న వరద నీటితో జలకళతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది.

దీంతో బ్యారేజీ గేట్లను ఎత్తివేసి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశ బ్యారేజి వద్ద నీటి ప్రవాహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. అదే  విధంగా  శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు కూడా జలకళతో కలకలలాడుతున్నాయి. పెథాయ్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీలు నీటి కళను సంతరించుకున్నాయి.