ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఓటు

ప్రజాయుద్ధ నౌక గద్దర్ తన జీవితంలో తొలిసారిగా ఓటు వేశారు. బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం అన్న వామపక్ష తీవ్రవాద భావజాలంలో ఇంత కాలం ఓటింగ్ కు దూరంగా ఉన్న గద్దర్ తొలిసారిగా ఈ ఎన్నికలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్వాల్ భూదేవినగర్ లోని సెంట్ జేవియర్ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో గద్దర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గద్దర్ ప్రజాకూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

SHARE