ప్రతి స్త్రీ తన రక్షణ కోసం కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని చట్టాలు ఇవే ??(పార్ట్ -1)

Share

ఒకరితో  మరొకరు కలిసి ధర్మ బద్దం గా జీవించడానికి వివాహం  అనే సంప్రదాయాన్ని కనిపెట్టారు. అయితే, దాని అర్థం మనమే పూర్తిగా మార్చేశాం. ఆడపిల్ల అంటే పెళ్లికి కట్న కానుకలు  తేవాలి ,ఉద్యోగం  చేసి  సంపాదిస్తూ ఇంటి చాకిరీ మొత్తం చేయాలి..ఇలాంటి  ఎన్నో షరతులతో ఆడపిల్ల జీవితం ముడి పెట్టారు….కొందరు భర్తతో కలిసి అత్త, ఆడపడుచు  అదనపు కట్నం కోసం పెట్టే చిత్రహింసలు భరించలేక చాలా మంది యువతులు ప్రాణాలు తీసుకున్న ఘటనలు చాలా జరిగాయి… ఇంకా  జరుగుతూనే ఉన్నాయి.  ఇలాంటి  వాటి నుండి బయట పడాలంటే కనీసం కొంతైనా అమ్మాయిలు చట్టాల గురించి అవగాహన కలిగి  ఉండాలని నిపుణులు తెలియచేస్తున్నారు.

పెళ్ళైన ప్రతి అమ్మాయి కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని చట్టాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. పెళ్లి తర్వాత భర్త చనిపోయిన కూడా అత్తింటిలో ఆమె ఉండొచ్చు.  విడాకులు పొందాలి అనుకుంటున్నాను వారయితే… ఆమె ఉండడానికి అనుకూలం గా ఉండే వేరే ఇళ్లు దొరికె వరకు అత్తింటిలోనే నివాసం ఉండొచ్చు. లేదా  ఆమెకు అదే ఇంట్లో ఉండాలని అనిపించినా కూడా.. అక్కడే ఉండే హక్కు ఆమెకు ఉంటుంది.  చట్టం ప్రకారం ఆ వెసులుబాటు ఉంది….హిందూ వివాహ చట్టం, 1995 లోని సెక్షన్ 13 ప్రకారం అవిశ్వాసం, క్రూరత్వం, శారీరక ,మానసిక హింస మరెన్నో విషయంలో స్త్రీలు  తమ భర్త అనుమతి లేకుండానే విడాకుల కోసం చట్టబద్ధంగా దాఖలు చేసుకోవచ్చు. స్త్రీలు  నిర్వహణ ఛార్జీని సెక్షన్ 125 కింద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.

భారతీయ శిక్షాస్మృతి ప్రకారం స్త్రీలు  తనకు, తన బిడ్డకు అవసరమైన ఆర్థిక నిర్వహణ కొరకు భర్త నుంచి డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అతని సంపాదన ను బట్టి.. ఈ డబ్బులు ఆమె  కి ఇవ్వాల్సి ఉంటుంది….హిందూ వారసత్వ చట్టం, 1956 లోని సెక్షన్ 14 మరియు హిందూ వివాహ చట్టం 1955 లోని సెక్షన్ 27 ఒక మహిళా   ‘స్త్రీ ధన్’ ను తన ఏకైక యజమానిగా హక్కుగా చేసుకోవడానికి అనుమతిస్తుంది


Share

Related posts

Central Budget ; బీజేపీ అంతే- మనం ఇంతే..! ఎన్నికలు లేవుగా.. ఏపీకి గుండు సున్నా..!!

Srinivas Manem

బిగ్ బాస్ 4: హౌస్ లో టాస్క్ ల విషయంలో విమర్శలు..!!

sekhar

చమక్ చంద్ర డెసిషన్ తీసుకోవడంలో ఇంకా లేట్ చేస్తే అదే జరగనున్నదా?

Naina