ఫోన్ ఈ పద్ధతిలో వాడితే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు!!(పార్ట్ -1)

Share

కొందరు రోడ్డు మీద ఉన్న సంగతి కూడా మర్చిపోయి  మొబైల్‌ లో మునిగిపోయి నడుచుకుంటూ ఎదుటి మనుషుల్నిగుద్దేసేవారు, వాట్సప్‌ చెక్‌ చేసుకుంటూ ఎదురుగా ఉన్న కరెంట్‌ పోల్‌ చూసుకోకుండా తన్నుకునేవారు ,ఫోన్‌లో తలదూర్చేసి పక్కన ఏమి జరుగుతుందో కూడా  తెలియని వాళ్ళు,  ఇలా  రక రకాలుగా  ఫోన్ కి   బానిస  అయిన వాళ్ళు  చాలామంది ని మనం  చూస్తూనే ఉంటాం. ఇలా చేసేవాళ్లను  ముద్దుగా మొబైల్‌ మానియాక్స్‌ అని అంటుంటారు.


మా వాడిచేతిలో  మొబైల్‌ ఉంటే ఒళ్ళుకూడా  మరచిపోతాడు అనే మాటలు మనకు ఎప్పుడు  వినిపిస్తూనే ఉంటాయి. ఇదంతా వినడానికి ఏదో నవ్వు తెప్పించే విషయం లా  ఉన్న ఈ  పద్ధతి  వలన ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి అంటున్నారు పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన చాలా పరిశోధనలు ఈ విషయాన్ని బయట పెట్టాయి అని నిపుణులు తెలియచేస్తున్నారు . ప్రపంచ ఆరోగ్య సంస్థ మొబైల్‌ ఫోన్‌ వినియోగం గురించి ఓ నివేదిక విడుదల చేయగా  దానిలో  ఈ  విషయాలు  ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం  ఫోన్  వాడుతూ  డ్రైవర్లు డ్రైవింగ్ లో ఉండడం  వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది.

మొబైల్ ఉపయోగించకుండా  డ్రైవింగ్‌ చేసేవారితో  పోలిస్తే ఫోన్  చూస్తూ డ్రైవింగ్‌ చేసేవారి  వలన ప్రమాదాల భారిన పడే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని తెలియచేసారు. మొబైల్‌ వాడుతూ డ్రైవింగ్‌ చేయడం పని  మీద ద్రుష్టి  లేకుండా  చేయడమే  కాబట్టి  ప్రమాదాలు    జరగడానికి  మూలా కారణమని పరిశోధకులు తెలియచేస్తున్నారు .అంతవరకూ  ఎందుకు ఒక డ్రైవింగ్‌ లోనే కాదు..  నడిచేటప్పుడు  కూడా ఈ సమస్యవస్తుంది. వందలో 17 మంది యూత్  మొబైల్‌ చూస్తూనో, కాల్‌ మాట్లాడుతూనో ఎదురుగా వస్తున్న మనిషి ని  లేదా ఉన్న వస్తువును కూడా చూడకుండా గుద్దేస్తున్నారట.


Share

Related posts

PM Modi: యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి…! ప్రధాని నరేంద్ర మోడీ..!!

somaraju sharma

Corona: తెలంగాణ‌కు గుడ్ న్యూస్ … క‌రోనా స‌మ‌యంలో రెమ్డిసివిర్‌, ఆక్సిజ‌న్ భారీ స‌ర‌ఫ‌రా

sridhar

Jagan : చంద్రబాబు ప్లాన్ అమలు చేసి జగన్ హీరో అయ్యడు…! బాబు మాత్రం విలన్ అయ్యాడు

siddhu