బీజేఎల్పీ సమావేశంలో వాడివేడి చర్చ

బీజేపీ పార్లమెుంటరీ పార్టీ సమావేశంలో వాడివేడి చర్చ సాగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నేడిక్కడ జరుగుతున్న బీజేఎల్పీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో పార్టీ పరాజయం, మిజోరం, తెలంగాణ ఫలితాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. పార్టీ పరాజయానికి కారణాలపై బీజేఎల్పీ సమావేశం లోతుగా చర్చిస్తున్నదని సమాచారం. సార్వత్రిక ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం పడకుండా తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. అదే విధంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సమావేశం చర్చిస్తుంది.