బీజేపీతో పొత్తుపై మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు

పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యా సదృసమని తెలిసీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభఉత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద పొరపాటని పేర్కొన్నారు. పాకిస్థాన్ తో సత్సంబంధాల కోసం కృషి చేస్తానన్న మోడీ మాటలు నమ్మి పోసపోయామని పేర్కొన్నారు.

మోడీకి పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉండటం, గతంలో వాజ్ పేయికి కూడా ఇంత మెజారిటీ లేకపోవడంతో నాడు వాజ్ పేయి హయాంలో ఆరంభమై ఆగిపోయిన చర్చల ప్రక్రియను మోడీ కొనసాగిస్తారని విశ్వసించామని ఆమె పేర్కొన్నారు. అయితే మోడీ సర్కార్ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా…పరిస్థితి మరింత క్షీణించే విధంగా వ్యవహరించిందని ముఫ్తీ విమర్శించారు.