బెంబేలెత్తిస్తున్న దెయ్యం చేప

ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వారైతాంగాన్ని దెయ్యం చేప బెంబేలెత్తిస్తోంది. నిలువెల్లా విషం ముల్లుతో నిండి ఉండే ఈ చేప కారణంగా ఆక్వారైతాంగం తీవ్ర ఆందోళనకు గురౌతున్నది. క్యాట్ ఫిష్ జాతికి చెందిన ఈ చేప కాల్వల్లో, చెరువుల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. పొరపాటున ఈ చేప ముల్లు గుచ్చుకున్నా ప్రాణాలకు ప్రమాదమేనని మత్స్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.