బ్రిటన్ ప్రధానికి ఊరట

బ్రిటన్ ప్రధాని థెరిస్సా మేకు గొప్ప ఊరట లభించింది. బ్రిటన్ పార్లమెంటులో ఆమెపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పార్లమెంటు విశ్వాసం పొందడం ప్రధాని మేకు గొప్ప ఊరటే అయినా…అది తాత్కాలికం మాత్రమే. బ్రిగ్జిట్ వ్యవహారంలో ఆమెకు ముందు ముందు మరిన్ని సవాళ్లు ఎదురౌతాయనడంలో సందేహం లేదు. అమెపై అవిశ్వాస తీర్మానం పార్లమెుంటులో వీగిపోయినప్పటికీ…థెరిస్సా మే మరిన్ని సవాళ్లు ఎదుర్కొనక తప్పదన్న విషయం మాత్రం తేటతెల్లమైపోయింది. 200-117 తేడాతో అవిశ్వాసం వీగిపోయింది. దీంతో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 83 మంది ఎంపీల మెజారిటీ ఆమెకు లభించినట్లయ్యింది.