భగత్ సింగ్ టెర్రరిస్ట్ అన్న ప్రొఫెసర్ కు ఉద్వాసన!

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ ను ఓ టెర్రరిస్ట్ గా అభివర్ణించిన జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముహమ్మద్ తాజుద్దీన్ ను సస్పెండ్ చేశారు. భగత్ సింగ్ ను టెర్రరిస్ట్ గా అభివర్ణిస్తూ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ వార్త వెలువడిన వెంటనే ప్రొఫెసర్ తాజుద్దీన్ క్షమాపణలు చెప్పారు. తన మాటల వెనుక ఉద్దేశం విద్యార్థులకు అర్థం కాలేదని భావిస్తున్నట్లు తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని ప్రొఫెసర్ వివరణ ఇచ్చారు. తాను చేసిన తప్పిదానికి క్షమించాలని కోరారు.

SHARE