భారత్ లక్ష్యం 289

సిడ్ని(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే భారత్ 289 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది. ఆసీస్-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పొయి 288 పరుగులు సాధించింది.
శనివారం సిడ్ని వేదికగా మొదలయిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టులో బ్యాట్స్‌మెన్ ఖ్వాజా 59, షాన్ మార్స్ 54, హ్యాండ్స్ కాంబ్ 73, ఎం స్టోన్స్ 47 పరుగులు సాధించారు.
ఇండియా జట్టు బౌలర్లు కులదీప్‌,భువనేశ్వర్‌లు రెండు వికెట్ల వంతున, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
లంచ్ అనంతరం భారత్ బ్యాటింగ్ చేపట్టనుంది.