భారత రాయబారి నివాసానికి కరెంట్ కట్

పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశంలోని భారత దౌత్యాధికారులపై వేధింపులకు పాల్పడుతున్నది. భారత్ పట్ల తన శత్రుపూరిత వైఖరికి నిదర్శనంగా పాకిస్థాన్ ఆ దేశంలో ఉన్న మన దౌత్యాధికారులను అడుగడుగునా అవమానాలకు గురి చేయడమే కాకుండా వేధింపులకు గురి ేచేస్తున్నది. ఆ దేశంలోని భారత దౌత్యాధికారులకు రేషన్ నిరాకరించడం, అతిధులను అవమానించడం చేస్తున్నది. దీనిపై భారత్ లోని పాక్ దౌత్యాధికారిని పిలిపించి వివరణ కోరినా పాకిస్థాన్ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు.

తాజాగా ఇస్లామాబాద్ లోని భారత రాయబారి నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాయబారి నివాసంలో విద్యుత్ కనెక్షన్ లో ఎటువంటి లోపం లేనప్పటికీ ఉద్దేశ పూర్వకంగానే విద్యుత్ ను కట్ చేసినట్లు భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. కాగా ఈ సంఘటనపై భారత దౌత్య కార్యాలయం పాక్ విదేశాంగ మంత్రికి ఫిర్యాదు  చేసి నిరసన తెలియజేసింది.

SHARE