భువనేశ్వర్ : నిధులు కావాలి- నెలజీతం ఇవ్వండి!

బిజు జనతాదళ్ పార్టీ నిధుల వేటలో పడింది. పార్టీ కోసం నిధులు సమకూర్చుకోవలసిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలిపారు. పార్టీ కోసం ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు.

అదే విధంగా పార్టీ కోసం నిధులు సమకూర్చుకోవడం కోసం విరాళాలు సేకరించాలని పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులకు రాసిన లేఖలో కోరారు. పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానుల నుంచి విరివిగా విరాళాలు సేకరించాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నవీన్ పట్నాయక్ పార్టీ ఫండ్ కోసం పార్టీ వర్గాలను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.