భోజనాలలో ముందుగా స్వీట్ వడ్డించడానికి, ఆరోగ్యానికి ఉన్న కనెక్షన్ ఏమిటో తెలుసా??

Share

భోజనాల్లో అన్నానికి ముందు స్వీట్లు వడ్డిస్తారు. అయితే  చాల మంది  ఆ స్వీట్స్  ని  ముందు తినకుండా  భోజనం  చేసాక  తింటే తిన్నదంతా  చక్కగా  జీర్ణం అవుతుంది అనే  ఉద్దేశం తో  భోజనం మొత్తం పూర్తి చేసాక మాత్రమే  స్వీట్స్  తింటుంటారు.  అయితే అలా తినడం వల్ల ఎటువంటి ప్రయోజనంఉండదు  అని  నిపుణులు తెలియచేస్తున్నారు.


బోజనాలలో  ముందు  స్వీట్  వడ్డించడానికి  ఒక కారణం  కూడా ఉందట. అసలు భోజనానికి ముందుగానే  స్వీట్లు ఎందుకు వడ్డిస్తారు ?అవి  తినడం వల్ల ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.అన్నదానం, రెస్టారెంట్లు, హోటల్స్‌లో అన్నం వడ్డించే ముందు కచ్చితం గా తీపి వడ్డించడానికి ఆరోగ్యానికి సంబంధిన సీక్రెట్‌ కూడా ఒకటి ఉందట. అది  ఏమిటంటే ఆహారం తీసుకునేందుకు ముందు ఆకలి ఉన్న కారణంగా పొట్టలో గ్యాస్‌ ఎక్కువగా  ఉంటుంది . అలాంటి సమయంలో స్వీట్స్‌ తినడం వలన  ఆ గ్యాస్‌ ప్రభావం మెల్లగా తగ్గుతుంది.
పండ్లు తీసుకోవడానికి ముందు కూడా  స్వీట్స్‌ తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారం జీర్ణమైపోయిన తరువాత పొట్టలో మిగిలి నిల్వ ఉండే వ్యర్థాలతో ఏర్పడే వ్యాధుల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి  అని ,ముందుగా  స్వీట్స్‌ను తినడం వలన  గ్యాస్ట్రిక్‌  వంటి సమస్యలు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.

ఆహారం తీసుకునేందుకు ఒక  గంట ముందు నీళ్ళు సేవించడం మంచిది . లేదా ఆహారం తిన్న  గంట  తర్వాత  నీళ్లు తాగాలి. ఒకవేళ  ఏదైనా  అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం నీరు త్రాగవచ్చు అని   ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ఆహారం తిన్న వెంటనే నిద్ర పోవడం అనేది మంచిది కాదు . రాత్రిపూట నిద్రించే రెండు గంటల ముందు ఆహారం తీసుకోవడం పూర్తి  చేయాలి. ఇలా  చేయడం వలన అజీర్ణ సమస్యలు ఉండకపోవడం  తో  పాటు తిన్న  ఆహారం కూడా కొవ్వు గా మారే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.


Share

Related posts

జ‌గ‌న్‌ను ఇరికించే ప‌నిలో టీడీపీ… జాగ్రత్త‌ప‌డుతున్న వైసీపీ

sridhar

Pawan Kalyan : స్క్రిప్ట్ పట్టుకొచ్చిన డైరెక్టర్ – ‘అవి’ మార్చుకురమ్మని పంపించేసిన పవన్ కల్యాణ్ ? 

arun kanna

ఓరి బుడ్డోడా? డ్యాన్స్ అదరగొట్టావు.. కేటీఆర్ ఫిదా.. వైరల్ వీడియో

Varun G