మండలిలో కాంగ్రెస్ జీరో

అనుకున్నట్లే అయ్యింది. తమను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నలుగురు ఈ ఉదయం మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ ఇచ్చారు. అంతే సాయంత్రానికల్లా వారి అభ్యర్థనకు మండలి చైర్మన్ ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు శాశన మండలి కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం నుంచి పూర్తిగా కోలుకోలేని కాంగ్రెస్ కు ఈ పరిణామంలో మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు దామోదరరెడ్డి, ప్రభాకరరావు, సంతోష్ కుమార్, ఆకుల లలితలు మండలి చైర్మన్ కు కలిసి తమను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రజలు తెరాస వైపే ఉన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో తేలిపోయిందనీ, అందుకే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తాము ప్రజాభీష్టం మేరకు టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని కోరుతున్నట్లు వారు మండలి చైర్మన్ కు లేఖ ఇచ్చారు,