మండలిలో కాంగ్రెస్ విపక్ష హోదా రద్దు

తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ కు విపక్ష హోదా రద్దైంది. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బతగులుతోంది. మండలిలో కాంగ్రెస్ సభ్యులు నలుగురు నిన్న తెరాస గూటికి చేరారు. ఆ వెంటనే మండలిలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని తెరాస ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు వినతి పత్రం ఇచ్చారు. వెంటనే ఆయన వారి అభ్యర్థనను ఆమోదించారు. సాయంత్రానికల్లా కాంగ్రెస్ సభ్యులు నలుగురినీ టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ ప్రకటన వెలువడింది. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే…మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దు చేస్తూ మండలి కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు మండలిలో మిగిలింది ఇద్దరు సభ్యులు మాత్రమే. వారి సభ్యత్వ గడువు కూడా వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అంటే మార్చి తరువాత తెలంగాణ మండలిలో కాంగ్రెస్ కు ప్రాతినిథ్యమే ఉండదు.

SHARE