మంత్రైనా తప్పదు మరి!

ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది. మంత్రైనా సరే ఎన్నికలంటే  సామాన్యుడిలా మారిపోవలసిందే. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలబడాల్సిందే. జైపూర్ లో అదే జరిగింది. బికనేర్  లో కేంద్ర  మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు ఓటు ఉంది. రాజస్థాన్  అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తన వోటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లి వరుసలో నిలబడ్డారు. సరిగ్గా అదే సమయంలో ఈవీఎం యంత్రం మొరాయించింది. దానిని సరిదిద్ది ఓటింగ్ కొనసాగించడానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. అంత సేపూ మంత్రి అర్జున్  రామ్  మేఘ్వాల్ క్యూలోనే నిలబడాల్సి వచ్చింది. జనం మధ్యలో అర్జున్ రామ్ మేఘ్వాల్ తన ఓటు హక్కు కోసం క్యూలో నిలబడి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది.

SHARE