మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ కే మెగ్గు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే స్వల్ప మొగ్గు కాంగ్రెస్ కే ఉంటుందన్నది ఎగ్జిట్ పోల్స్ సరాంశం. టైమ్స్ నౌ సర్వే ప్రకారం 230 స్థానాలున్న మధ్య ప్రదేశ్ లో బీజేపీ 126, కాంగ్రెస్ 89, బీఎస్పీ6 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది, ఇతరులు 8 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది. ఇక ఇండియా టుడే సర్వే ప్రకారం 200 స్థానాలున్న మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 102 నుంచి 120, కాంగ్రెస్ 104 నుంచి 122 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది, ఇక్కడ బీఎస్పీ1-3, ఇతరులు 3-8 స్థానాలలో విజయం సాధిస్తారు. అలాగే న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్  112, బీజేపీ 106, ఇతరులు 12 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయి.
SHARE