మధ్య ప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం

Share

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి  మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు విపక్ష నేతలు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తదితరులు హాజరయ్యారు.

ఇలా ఉండగా ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా భుపేష్ బాగ్లే ప్రమాణ స్వీకారోత్సవ వేదిక మారింది. ముందుగా ప్రకటించినట్లుగా సైన్స్ కాలేజీ మైదానంలో కాకుండా బల్బీర్ సింగ్ జునేజా ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటమే ఇందుకు కారణం. ఛత్తీస్ గఢ్ సిఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా పలువురు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


Share

Related posts

ట్రెండ్ మారింది బాస్.. మగాళ్లకూ బికినీలొచ్చాయ్..!!

Varun G

సినిమా చాన్స్ అంటూ మోసగాడి వల.. లక్షల్లో వసూళ్లు.. ఆపై

Muraliak

యాంకర్ లాస్య యూట్యూబ్ చానెల్ హ్యాక్.. ఆందోళనలో లాస్య?

Varun G

Leave a Comment