మరో సర్వే- కూటమికి 69

తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే వెలువడింది. దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను తాజాగా హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ వెలువరించింది. ఈ సర్వేలో టీఆర్ఎస్ 35 స్థానాలలో విజయం సాధిస్తుందని, ప్రజాకూటమి 69 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది.  ఇక బీజేపీ6, మజ్లిస్ 7 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ సర్వే పేర్కొంది.