మళ్లీ లెక్కపెట్టాలి : కోర్టుకెక్కిన మల్ రెడ్డి

ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలైన ఓట్లకు సంబంధించి వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించాలని కోరుతూ మల్ రెడ్డి రంగారెడ్డి హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన  హైకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి స్వల్ప తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.