మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పై అరెస్టు వారంట్

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పై అరెస్టు వారంట్ జారీ అయ్యింది.  ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ గౌతం గంభీర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మోసాలకు పాల్పడిన నేపథ్యంలో బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన గౌతం గంభీర్ ను చూసే ప్లాట్ల కోసం సొమ్ము చెల్లించామని వారు పేర్కొన్నారు.

ఘజియాబాద్ లో నిర్మించనున్న ప్లాట్ల కోసం17 మంది రూ.1.98 కోట్ల రూపాయలు చెల్లించారు. అయితే ప్లాట్ల నిర్మాణం జరగకపోవడంతో కొనుగోలు దారులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు సమన్లు జారీ చేసిన గౌతం గంభీర్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు గౌతం గంభీర్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది.