మిజోరంలో సీఎంన లాల్ తన్హావాలా ఓటమి

మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఎంఎన్ఎఫ్ హవా కొనసాగుతున్నది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీలో ఎమ్ఎన్ఎప్ 29 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ ఒక స్థానంలోనూ, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ సీఎం లాల్ తన్హా వాలా ఓటమి పాలయ్యారు. ఆయన రెండు స్థానాల్లో పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. లాల్ తన్హావాలా సెర్చిప్, దక్షిణ చంఫాయ్ నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగి రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. మిజోరం ఎన్నికలలో అధికార కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.