మిస్ వరల్డ్-2018 మెక్సికన్ బ్యూటీ

మిస్ వరల్డ్-2018 కిరీటం మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీలియోన్ కు దక్కింది. చైనాలోని సన్యా సిటీలో నిన్న రాత్రి జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పోన్స్ విజేతగా నిలవగా రన్నరప్ గా థాయ్ ల్యాండ్ సుందరి నికోలిన్ లిమ్స్ నుకన్ నిలిచింది. ఈ ఏడాది మిస్ వరల్డ్ కిరీటం కోసం వివిధ దేశాల నుంచి 118 మంది పోటీపడ్డారు.