మీ మంత్లీ EMI ఇంతకు మించి ఉంటే అసలుకే ఎసరు అని తెలుసుకోండి !!(పార్ట్-2)

Share

లోన్ తీసుకునేటప్పుడు లేదా క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఒకటికి పది  సార్లు అది అవసరమా ఆడంబరమా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు మీకు మంచి ఫోన్  ఉన్నా కానీ క్రెడిట్ కార్డు లో  కొత్త ఫోన్ కొనడం వంటివి  చేసేటప్పుడు ఇప్పుడు ఫోన్ కొనడం ఎంతవరకు అవసరం అనే విషయాన్ని ఆలోచించాలి. కొన్ని కొన్ని సార్లు అవసరం కన్నా అత్యవసరం అయితే తప్ప క్రెడిట్ కార్డు వాడటం లోన్ తీసుకోవడం వంటివి చేయకూడదు .


మీ ఆదాయం కన్నా మీరు తీసుకున్న లోన్, క్రెడిట్ కార్డు బిల్ ఈఎంఐ ఎక్కువగా ఉంటే మాత్రం  వెంటనే తగు జాగ్రత్త పడటం అవసరం. ముందుగా మీరు తీసుకున్న డబ్బులు ఏం చేశారు..? దాని వల్ల ఎంత వరకు ఉపయోగం ఉంది ? అని తప్పక ఆలోచించండి. అదే సమయంలో ఈఎంఐ, దానిపై పడే వడ్డీ గురించి కూడా వివరం గా  ఆలోచించండి. అటు ఈఎంఐ ల  మీద దృష్టి  పెడుతూనే  ఆదాయాన్ని పెంచుకునే మార్గాల  ను అన్వేషించండి.

ముందుగా తీసుకున్న లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్ పై ఉన్న వడ్డీ గురించి ఆలోచించండి. అధిక వడ్డీ గల రుణాలు ముందు  తీర్చే  ప్లాన్  వేసుకోండి.  ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ ,ఖర్చు  పెట్టె ప్రతి  రూపాయి  మీద  జాగ్రత్త లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మర్చిపోకండి . ఒకవేళ సమస్య  ఉంటే మాత్రం పరిష్కార మార్గాలు వెదకండి.మన ఆదాయం, ఈఎంఐ లు ఈ రెండిటి గురించి బాగా ఆలోచిస్తే మాత్రం జీవితాన్ని ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపవచ్చు.

పార్ట్ 1 కోసం ఈ లింకుని క్లిక్ చెయ్యండి 


Share

Related posts

Sujana Chowdhary : బిగ్ బ్రేకింగ్: ఎంపీ సుజనాకు ఈడీ నోటీసులు..!!

sekhar

బాబు ఏ దేశంలో ఉన్నాడో! అంత రహస్యమా?

somaraju sharma

చలికాలం పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. లేదంటే?

Teja