మీ మంత్లీ EMI ఇంతకు మించి ఉంటే అసలుకే ఎసరు అని తెలుసుకోండి !! (పార్ట్-1)

Share

మనకు తక్కువ ఆదాయం ఉన్నప్పుడు డబ్బులు సరిపోవు..ఆదాయం పెరిగిన కూడా సరిపోవు ఎందుకంటే పెరిగే జీతం లేదా ఆదాయంతో పాటు ఖర్చులూ పెంచేయడం దీనికి గల ప్రధాన కారణం. మనకు వచ్చే జీతాన్ని బట్టి రకరకాల  బ్యాంకు లు క్రెడిట్ కార్డులు, లోన్లు అందిస్తుంటాయి. అయితే ఎక్కువమంది  ఈ క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడడం  లేదా , అవసరం లేకపోయినా లోన్స్ తీసుకోవడం వంటివి  చేస్తుంటారు. దీంతో చివరకు తమకు వచ్చే ఆదాయం కన్నా తీసుకున్న లోన్లు లేదా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడానికి, వాటి ఈఎంఐల చెల్లింపుకు డబ్బులు సరిపోని పరిస్థితి  ఎదురవుతుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇలాంటి సమస్య వస్తే ఎలాఎదురుకోవాలి ?వాటిగురించి  ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు  కోసం కొన్ని బ్యాంకులు సంవత్సరానికి కొంత డబ్బును ఛార్జ్ చేస్తే మరికొన్ని మాత్రం ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఉచితంగా సేవలను అందిస్తుంటాయి. ఇంకా  చెప్పాలంటే క్రెడిట్ కార్డు అనేది ఒక తరహా చేబదులు గా  చెప్పవచ్చు. చేబదులు తీసుకున్నప్పుడు  సరైన సమయానికి కట్టేస్తే ఎలాంటిఇబ్బందులు ఉండవు. కట్టకపోతే మాత్రం పెనాల్టీలు తప్పవు అని గుర్తు పెట్టుకోండి.ఎక్కువ ఆలస్యం  చేయడం వల్ల అది తలకు మించిన భారంగా  మారి చివరికి ఆర్థిక నేరస్థులు చేసే  ప్రమాదం ఉంది అని  గమనించండి.

లోన్ల వల్ల  మరికొంతమంది ఇబ్బందులుపడుతుంటారు. పర్సనల్ లోన్ లేదంటే హోమ్ లోన్, వెహికల్ లోన్ లేదా మరే లోన్ అయినా మన స్థాయికి తగ్గట్టుగా ఉందా, దానిని తిరిగి చెల్లించే పరిస్థితి ,స్థోమత మనకు ఉన్నాయా అని ముందుగానే ఆలోచించడం చాలా అవసరం . కానీ చాలామంది చేసే తప్పు  ఏమిటంటే  లోన్ తీర్చడం ఎలా అనే విషయాన్ని సరిగా ఆలోచించకుండా  ముందు లోన్ తీసుకోవడం మీదనే ఎక్కువ  శ్రద్ధ  పెట్టడం వలన   సమస్యలు వస్తుంటాయి .

అసలు నెలకు మనకు వచ్చే ఆదాయం లోఈఎంఐ లకు ఎంత పోతుంది?మిగిలింది  ఖర్చులకు  సరిపోతుందా  లేదా  అనే విషయాన్ని ముందుగా బేరీజు వేసుకుని క్రెడిట్ కార్డు వాడకం కానీ లోన్ తీసుకోవడం గురించి కానీ కరెక్ట్  గా  ఆలోచించ గలుగుతారు. ఒకవేళ వచ్చే ఆదాయం కన్నా ఈఎంఐలు ఎక్కువగా ఉంటే అది  ఏ మాత్రం మంచిది కాదు.దానివలన  మీరు ఆర్థికంగా రోజు  రోజుకు  పతనమైపోతారని  గుర్తుంచుకోవాలి


Share

Related posts

లక్షన్నర ఇస్తా రండి .. అంటున్న జగన్ మోహన్ రెడ్డి ! 

sekhar

Uppena movie – Pavan Kalyan : రిలీజ్ కాకముందరే ఉప్పెన రివ్యూ చెప్పేసిన పవన్ కళ్యాణ్

bharani jella

ఆ వైసీపీ పార్టీ నాయకుడికి గాలం వేసిన బిజెపి..!!

sekhar