ముందు సీఎల్పీ నేతను ఎన్నుకోండి

మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ కు గవర్నర్ అనంది బెన్ పటేల్ షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలని పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం గవర్నర్ ను కలిసి కోరింది. ఈ సందర్భంగా గవర్నర్ వారితో ఆ సంగతి సరే కానీ…ముందు మీరు సీఎల్పీ నేతను ఎన్నుకోండి అని బదులిచ్చారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 115 స్థానాల కంటే ఆ పార్టీకి ఒక స్థానం తక్కువ వచ్చింది. అయితే ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమై బలం చేకూరింది. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ గవర్నర్ ను కలిశారు. అయితే కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై నేతను ఎన్నుకోకపోవడంతో ముందు ఆ పని చేయాలని గవర్నర్ వారికి సూచించారు.