ముంబై : బుల్లెట్ ట్రైన్ భూ మి కోల్పోయే రైతులతో జికా ప్రతినిధుల భేటీ రేపు

ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ వల్ల భూములు కోల్పోయే రైతులతో జపాన్ ఇంటర్నేషనల్  కో-ఆపరేటివ్  ఏజెన్సీ రేపు భేటీ కానుంది. కత్సో మత్సుమోటో నేతృత్వంలోని జికా ప్రతినిథుల బృందం భూములు కోల్పోనున్న రైతులతో  భేటీ  అవుతుంది. సూరత్ లో ఈ  భేటీ జరుగుతుంది. ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును జపాన్  ప్రభుత్వం జికా ద్వారా చేపట్టిన  సంగతి తెలిసిందే. భూమి  కోల్పోయే రైతుల తరఫున పిటిషన్  దాఖలు చేసిన న్యాయవాది  కూడా రేపటి భేటీలో పాల్గొంటారు.

SHARE