మూడో టెస్టుకూ అశ్విన్ అనుమానమే!

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో ఆడటం అనుమానమే. గాయం కారణంగా పెర్త్ లో జరిగిన రెండో టెస్ట్ కు అశ్విన్ దూరమైన సంగతి తెలిసిందే. పిచ్ కు అనుకూలించిన ఆ టెస్ట్ లో అశ్విన్ లేకపోవడం, మరో స్పిన్నర్ జడేజాను జట్టులోనికి తీసుకోకపోవడంతో భారత్ 146 పరుగుల తేడాతో ఆ టెస్టులో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

గాయం నుంచి కోలుకున్న అశ్విన్ మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ…అస్వస్థత కారణంగా టెస్టులో ఆడేదీ లేనిదీ చెప్పలేమని జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఈ రోజిక్కడ వెల్లడించారు. అయితే కోలుకుని ఫిట్ నెస్ సాధిస్తే అశ్విన్ జట్టులో ఉంటాడనీ, ఏ విషయంలో వచ్చే రెండు రోజుల్లో తేలుతుందని పేర్కొన్నాడు.