మేమంతా ఒక్కటే!

మహాకూటమి నేతలు గవర్నర్ నరసింహన్ తో ఈ రోజు భేటీ కానున్నారు. తామంతా ఎన్నికలకు ముందుగానే పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేశామనీ, కనుక ప్రజాకూటమి సీట్లను ఒకటిగానే గుర్తించాలని వారు గవర్నర్ ను కోరుతారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ నాయకుడు చాట వెంకటరెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరామ్ లు ఈ రోజు గవర్నర్ ను కలిసి ఈ మేరకు వినతపత్రం సమర్పిస్తారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ సారి హంగ్ వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనూ బీజేపీ టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కూటమి నేతలు గవర్నర్ ను కలిసి ప్రజాకూటమి సీట్లను ఒక్కటిగానే గుర్తించాలని కోరనుండటం గమనార్హం. ఇప్పటికే కూటమి నేతలు భేటీ అయ్యారు. ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.