మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత

టీడీపీ మాజీ నాయకుడు, ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి  మోత్కుపల్లి నర్సింహులు  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో పాటు వాంతులు, విరోచనాలు కావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మోత్కుపల్లికి జనసేనాని  పవన్ కల్యాణ్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇటీవలె పవన్ కల్యాణ్ కంగ్రాట్స్ మోత్కుపల్లీ అంటూ అభినందించారు. సరిగ్గా పోలింగ్ సమయంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.