మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో కాంగ్రెస్

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో హస్తానిదే పై చేయి అయ్యింది. అయితే అధికారం చేపట్టడానికి అసవరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో కాంగ్రెస్ నిలిచిపోయింది. మొత్తం 230 స్థానాలున్నఅసెంబ్లీలో కాంగ్రెస్ 114 స్థానాలలో విజయం సాధించింది. అధికార బీజేపీ 109 స్థానాలలో గెలుపొందింది. బీఎస్పీ 2 స్థానాలు కైవసం చేసుకోగా, ఇతరులు 5 స్థానాలలో విజయం సాధించారు. నిన్న ఉదయం ప్రారంభైన ఓట్ల లెక్కింపు ఈ ఉదయం వరకూ కొనసాగింది. ఫలితాలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ 115 స్థానాలు రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్, బీజేపీలు తమతమ ప్రయత్నాలను ప్రారంభించారు. ఇరు పార్టీల నేతలూ కూడా ఈ రోజు గవర్నర్ ను కలవనున్నారు. ఇండిపెండెంట్లె, బీఎస్పీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎవరికి సహకరిస్తే వారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.