యూట్యూబ్ సెలబ్రిటీ వంటల మస్తానమ్మ కన్నుమూత

ఆరుబయట పాతకాలం వంటలతో యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయమైన వంటల మస్తానమ్మ కన్నుమూశారు. వయోభారంతో గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మస్తానమ్మ తన స్వస్థలమైన గుడివాడలో  మరణించారు. రుచికరమైన వంటలు చేయడంలో సిద్ధహస్తురాలైన మస్తానమ్మ వృద్ధాప్యంలో కూడా చాలా ఇష్టంగా వంటలు చేసేది. అమె వంటల ప్రావీణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ఆమె మనవడు భావించాడు. దీంతో ఆమె వంట చేస్తున్న విధానాన్ని, ఆమె వంటల తయారీలోని మెళకువలను ప్రపంచానికి పరిచయం చేస్తూ యూట్యూబ్ లో పెట్టిన పోస్టులు వెంటనే వైరల్ అయ్యాయి. అలా మస్తానమ్మ యూట్యూబ్ సెలబ్రిటీగా మారిపోయింది.