రథయాత్రపై సుప్రీంకు బీజేపీ

పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ తలపెట్టిన రథయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ కోల్ కతా హైకోర్టు తీర్పుపై బీజేపీ సుప్రీంను ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ రథయాత్రకు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కోర్టును ఆశ్రయించడా కోల్ కతా హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి రథయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై పశ్చిమ బెంగాల్ సర్కార్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో బీజేపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.