రహానే హాఫ్ సెంచరీ

పెర్త్ టెస్ట్ లో  అజింక్యా రహానే హాఫ్ సెంచరీ సాధించాడు.  రెండో రోజు భారత్ పై చేయి సాధించిందనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 326 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ఓపెనర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ… కెప్టెన్  కోహ్లీ,వైస్ కెప్టెన్ రహానాలు అద్భుతంగా రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 172   పరుగులు చేసింది.   ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు   ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులకు ఆలౌట్ కాగా, బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. మురళీ విజయ్ డకౌట్ కాగా, లోకేష్ రాహుల్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు.  ఆ తరువాత పుజారా, కోహ్లీలు కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా..24 పరుగులు చేసిన పుజారా వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటవ్వడంతో భారత్ కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే పుజారా ఔటవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన రహానే చక్కటి స్క్రోక్స్ తో ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ కోహ్లీ, రహానేలు మంచి సమన్వయంతో ఆడుతూ జట్టు స్కోరును నడిపించారు. ఈ క్రమంలో ఇరువురూ హాఫ్ సెంచరీలు సాధించారు. రహానే 51 పరుగులతోనూ, కోహ్లీ 82 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.