రాజస్థాన్ కేబినెట్ విస్తరణ నేడు

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాన్ నేడు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. 13 మంది కేబినెట్ 10 మంది సహాయ  మంత్రులను తన మంత్రివర్గంలోనికి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోనికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెహ్లాట్, ఉపముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ ఈ నెల 17న ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే పూర్తి కేబినెట్ విషయంలో అశోక్ గెహ్లాన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. సీఎం పదవి కోసం గెహ్లాట్ తో సచిన్ పైలట్ పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ జోక్యంతో సచిన్ పైలట్ ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు సచిన్ పైలట్ కు అప్పగించారు. ఇక మంత్రి వర్గ విస్తరణలో గెహ్లాట్ తనదైన ముద్ర ఉండేలా అన్ని రకాలుగా సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు కేబినెట్ విస్తరణకు నేడు ముహూర్తం పెట్టారు.