రాజస్థాన్ లో పైలట్, వసుంధరరాజె ఆధిక్యం

రాజస్థాన్ లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ హస్తం హవా కనిపిస్తున్నది. టోంక్ నియోజకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్ ఆధిక్యత కనబరుస్తున్నారు. అలాగే తన నియోజకర్గంలో రాజస్థాన్ సీఎం, బీజేపీ అభ్యర్థి వసుంధరరాజే ఆధిక్యత కనబరుస్తున్నారు. ఛత్తిస్ గఢ్ లో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీలు తలపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇక్కడ అందుబాటులో ఉన్న ఆధిక్యతలను బట్టి మూడు స్థానాలలో బీజేపీ, మూడు స్థానాలలో మూడు స్థానాలలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. మధ్య ప్రదేశ్ లో తొలి ఆధిక్యతలలో బీజేపీ 3 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలలో ఆధిక్యత కనబరుస్తున్నాయి.