రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లీట్ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కొద్ది సేపటి కిందట ప్రమాణ స్వీకారం చేశారు. మరో సీనియర్ నేత సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజె, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఇంకా పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజు జరగనున్న సంగతి తెలిసిందే.