రాజస్థాన్ సీఎం గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గెహ్లీట్ ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఆ పదవి కోసం చివరి వరకూ పోటీపడిన సచిన్ పైలట్ అంగీకరించారు. దీంతో సీఎం ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. రెండు రోజుల పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సుదీర్ఘ మంతనాలు, సంప్రదింపుల అనంతరం సీఎం పదవి కోసం పోటీ పడుతున్న గెహ్టాట్, సచిన్ పైలట్ ల మధ్య రాజీ కుదిర్చారు. అనుభవానికే పెద్ద పీట వేసి గెహ్లాట్ ను సీఎంగా ఎంపిక చేశారు. ఇక సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే రాజస్థాన్ పీసీసీ చీఫ్ గా సచిన్ పైలట్ కొనసాగుతారు. మొత్తం మీద రాజస్థాన్ సీఎం విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.