రాజ్యసభలో గందరగోళం,వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా వాయిదాల బాటనే సాగేలా కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఈ రోజు సమావేశం అయిన వెంటనే రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే వివిధ పార్టీల సభ్యులు తమతమ రాష్ట్రాల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియంలోనికి దూసుకువెళ్లారు. దీంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పదేపదే సభ్యులను శాంతంగా ఉండాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆయన సభను రేపటికి వాయిదా వేశారు. అటు లోక్ సభలో దివంగత సభ్యుడు అంబరీష్ కు సభ నివాళులర్పించింది. ఆ తరువాత కొద్ది సేపు వాయిదా పడింది.

SHARE