రాజ్యాంగ వ్యవస్థలకుముప్పు- తృణమూల్

ఆర్బీఐ వంటి రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పుపై రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఈ రోజు నోటీసు ఇచ్చింది. రాజ్యాంగ వ్యవస్థలకు వాటిల్లుతున్న ముప్పుపై రూల్ నంబర్ 276 కింద తక్షణమే చర్చ చేపట్టాలని నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై సభలో ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా వ్యవహారం పార్లమెంటులో వాడివేడి చర్చకు తెరలేపుతుందన్నది ఊహించినదే. కాగా ఆర్బీఐ కొత్త గవర్నర్ గా శక్తికాంత్ దాస్ ను నియమించడంతో ఆర్థిక నిపుణులలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిలో బ్యూరోక్రాట్ ను నియమించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉర్జిత్ రాజీనామా అనంతరం ఆర్బీఐకు తాత్కాలిక గవర్నర్ ను నియమిస్తారని అంతా భావించినా కేంద్రం శక్తికాంత్ దాస్ ను మూడేళ్ల కాలానికి నియమించిన సంగతి తెలిసిందే.

SHARE