రాణించిన బౌలర్లు-ఆసీస్ 191/7

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి విదితమే. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియాకు పరుగులు రావడమే కష్టమైంది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, ఇషాంత్ శర్మ, బుమ్రాలు చెరో రెండు వికెట్ల పడగొట్టారు.