రాఫెల్ ఒప్పందంపైనే మా అభ్యంతరం :చిదంబరం

రాఫెల్ ఒప్పందాన్ని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను తాము తప్పుపట్టడం లేదన్నారు. ఒప్పందం విషయంలో పారదర్శకత లోపించిందనీ, అవినీతీ చోటు చేసుకుందని మాత్రమే తాము విమర్శిస్తున్నామని చిదంబరం అన్నారు.

అంతే కానీ రాఫెల్ యుద్ధ విమానాల నాణ్యత, విశిష్టతల విషయంలో తామేమీ విమర్శలు చేయడ లేదని చిదంబరం పేర్కొన్నారు. అందుకే తమ అభ్యంతరాలు, విమర్శలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్పందించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటంలో ఐఎఎఫ్, ఆర్మీలకు సంబంధం లేదనీ, వాటి పట్ల తమకు అపార నమ్మకం, గౌరవం ఉన్నాయని స్పష్ట చేశారు. అందుకే రాఫెల్ చర్చ నుంచి ఆ రెండూ దూరంగా ఉండాలని విజ్ణప్తి చేశారు.