రాఫెల్ ఓకే : సుప్రీం

రాఫెల్ ఒప్పందం విషయంలో మోడీ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్ ఒప్పందంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఒప్పందం పారదర్శకంగానే జరిగిందని తీర్పు ఇచ్చింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కొద్ది సేపటి కిందట తీర్పు వెలువరించింది. ఈ ఒప్పందంపై దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసిందిదేశ భద్రత దృష్ట్యా రాఫెల్ ధరల విషయంలో రహస్యం ఉండాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

సుప్రీం తీర్పుతో  రాఫెల్ వ్యవహారంపై పార్లమెంటులో మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలన్న కాంగ్రెస్ వ్యూహం పారే అవకాశం లేకుండా పోయింది. సుప్రీం తీర్పు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఒకింత డిఫెన్స్ లో పడిన మోడీ సర్కార్ కు ఊరట కలిగించిందనే చెప్పాలి.

SHARE