రాఫెల్ కేంద్రానిదే బాధ్యత

సుప్రీం తీర్పు తరువాత కూడా రాఫెల్ సెగలు చల్లారలేదు. పీఏసీకి కాగ్ నివేదిక పంపించిందంటూ అటార్నీ జనరల్ సుప్రీంకు తప్పుడు నివేదిక ఇచ్చారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ రాఫెల్ వంటి వ్యవహారాల నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు కాదు పార్లమెంటే సరైన వేదిక అన్నారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో ప్రధానికి సుప్రీం ప్రశ్నించలేదనీ, అలాగే ఒప్పంద పత్రాలను సమర్పించాల్సిందిగా ఆదేశించలేదని ఆయన పేర్కొన్నారు. విపక్షంగా ఈ విషయంలో తాము మాత్రమే మోడీని నిలదీయగలమని ఆయన  పేర్కొన్నారు. కాగ్ నివేదికను పీఏసీకి సమర్పించామంటూ కేంద్రం తప్పుడు సమాచారాన్ని సుప్రీంకు ఇవ్వడం చాలా తీవ్రమైన విషయమని కపిల్ సిబల్ మండిపడ్డారు.