రాఫెల్ డీల్- హెచ్ఎఎల్ కేం సంబంధం

ఎంత కప్పిపుచ్చుదామనుకున్న కేంద్రానికి రాఫెల్ డీల్ రోజుకొక తలనొప్పి తీసుకువస్తూనే ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో హెచ్ఎఎల్ కు ముందుగా విమానాల తయారీని అప్పగించేందుకు యూపీఏ హయాంలో ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తరువాత జరిగిన పరిణామాలలో ఒప్పందంలో హెచ్ఎఎల్ పాత్రే లేకుండా పోయింది.

తొలుత 126 విమానాల కొనుగోలు కోసం జరిగిన ప్రయత్నం ఎన్డీయే హయాంలో 36విమానాలకు పరిమితమైంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో హెచ్ఎఎల్ పాత్ర ఎందుకు లేకుండా పోయిందన్న విషయంలపై తానేం వ్యాఖ్యనించబోనని ఆ సంస్థ చైర్మన్ ఆర్.మాథవన్ అన్నారు. అయినా ఈ వ్యవహారంలో హెచ్ఎఎల్ కు ఏం సంబంధమని ఎదురు ప్రశ్నించారు.