Categories: న్యూస్

“రామారావు ఆన్ డ్యూటీ” ప్రీ రిలీజ్ వేడుకలో నాని పై రవితేజ పొగడ్తల వర్షం..!!

Share

శరత్ మాండవ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో రవితేజ నటించిన “రామారావు ఆన్ డ్యూటీ” జులై 28వ తారీకు విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రవి అన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కెరియర్ లో విజయవంతంగా రాణించడం జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇక రవితేజ సినిమా గురించి అనేక విషయాలు తెలియజేస్తూ హీరో నాని.. అంటే వ్యక్తిగతంగా మాత్రమే కాదు ప్రొఫెషనల్ గా చాలా ఇష్టం అని పేర్కొన్నారు. తెలుగులోనే కాదు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఫైనాన్స్ ఆర్టిస్ట్ అని స్పష్టం చేశారు. అతని టైమింగ్ చాలా ఇష్టం… చాలా సెన్సిబుల్ నటుడు అని స్పష్టం చేశారు. ఇక చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన హీరో వేణు నీ కూడా రవితేజ పొగడ్తలతో ముంచెత్తారు. సెకండ్ ఇన్నింగ్స్ చాలా విజయవంతంగా కొనసాగించాలని మళ్లీ ఎక్కడ గ్యాప్ రాకూడదని చెప్పుకొచ్చారు.

వాస్తవానికి వేణుతో అప్పట్లో “స్వయంవరం” సినిమాల్లో నటించాలి కానీ అది మిస్ అయింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో వేణుతో నటించడం చాలా సంతోషంగా ఉందని రవితేజ పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలు తెలియజేసి కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని రవితేజ అన్నారు. ఈ సినిమాలో రవితేజ కలెక్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. కెరియర్ లో ఎప్పుడు చేయని పాత్రలో రవితేజ నటించటంతో “రామారావు ఆన్ డ్యూటీ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

37 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

40 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

57 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

1 గంట ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

2 గంటలు ago