రాష్ట్రపతి హైదరాబాద్ రాక 21న

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకూ ఆయన నాలుగు రోజుల పాటు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో బస చేస్తారు. రాష్ట్రపతి ఏటా శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం ఒక ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. బోల్లారంలో రాజభవనాన్ని తలపించేదిగా ఉండే రాష్ట్రపతి భవన్ ను రామ్ నాథ్ కోవింద్ రాకసందర్భంగా ముస్తాబు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లోని గార్డెన్, పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రపతి భవన్ ను రాష్ట్రపతి బస చేసిన వెళ్లిన అనంతరం కొద్ది రోజుల పాటు ప్రజలు సందర్శించడానికి వీలుగా తెరిచి ఉంచుతారు.

SHARE