రాహుల్ కు కేంద్ర మంత్రి అథవాలే ప్రశంసలు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అథవాలే నుంచి అనూహ్యంగా ప్రశంసలు లభించాయి. రాహుల్ గాంధీ ఇంకెంత మాత్రం పప్పు కాదనీ, ఆయన ఇప్పుడు పప్పా అని అధవాలే అన్నారు. హిందీ బెల్ట్ రాష్ట్రాలు మూడింటిలో కాంగ్రెస్ ను విజయ పథంలో నడిపించిన రాహుల్ గాంధీపై జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే సానుకూల వాతావరణం ఏర్పడుతున్నది. ఈ తరుణంలో రామదాస్ అథవాలే రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎదురుపడినా కూడా కనీసం పలకరించుకోకుండా ఎడముఖం, పెడముఖంగా మెలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అథవాలే రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయానికీ ప్రధాని మోడీకీ ఎటువంటి సంబంధం లేదని అథవాలే పేర్కొనడం గమనార్హం.

SHARE