రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ లో వివిధ ఖాళీలు.. రాత పరీక్ష లేకుండా భర్తీ.. మిస్స్ చేసుకోకండి..

Share

 

భారత ప్రభుత్వ సంస్థ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన యునెస్కో ఆధ్వర్యంలోని రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్ సీ బీ) వివిధ రకాల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.. రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..

 

 

మొత్తం ఖాళీలు : 18

విభాగాల వారీగా ఖాళీలు : బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్టర్ ఫైనాన్స్ ఆఫీసర్ , సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ , టెక్నికల్ ఆఫీసర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ఇంజనీర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

అర్హతలు :

పోస్ట్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బీ ఈ, బిటెక్(ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఐటీ, సివిల్) ఎంసీఏ, ఎమ్మెస్సీ ఫార్మ, పీజీ (ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 

వయసు :

పోస్టులను అనుసరించి 30-56 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

 

ఎంపిక విధానం :

అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను మొదట స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందజేసి వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియామకం జరుగుతుంది.

 

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

 

దరఖాస్తు ఫీజు : రూ. 1000/-

 

దరఖాస్తులకు చివరి తేదీ : 1/2/2020.


Share

Related posts

Crime News: మీ ఫోన్ రిపేర్ వచ్చిందని ఇలా మాత్రం చేయకండి??చాలా ప్రమాదం!!

Naina

Mahesh : మహేష్ సర్కారు వారి పాట మళ్ళీ దుబాయ్‌కా.. అప్పుడే రీ షూటా..?

GRK

తెలంగాణ సీఎం కెసిఆర్ బంధువుల కిడ్నాప్…! నిందితుల్లో ఏపి మాజీ మంత్రి బంధువు..! కిడ్నాప్ కథ సుఖాంతం..!!

somaraju sharma